Tamilisai Soundararajan: ఆర్టీసీ బిల్లును పరిశీలించేందుకు కొంత సమయం కావాలి: గవర్నర్ తమిళిసై

  • ఆర్ధిక బిల్లు కావడంతో ముందుగా గవర్నర్ ఆమోదం కోసం వెళ్లిన బిల్లు   
  • బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందన్న గవర్నర్ 
  • బిల్లుపై న్యాయ సలహాలు తీసుకుంటానన్న గవర్నర్
Governor Tamilisai on RTC bill

ఆర్టీసీని ప్రభుత్వంలో విలీనం చేస్తూ ఇటీవల తెలంగాణ కేబినెట్ నిర్ణయం తీసుకుంది. ఆర్ధిక బిల్లు కావడంతో దీనిని రాష్ట్ర ప్రభుత్వం ముందుగా గవర్నర్ తమిళిసై‌ ఆమోదం కోసం పంపించింది. అయితే, ఈ బిల్లుకు గవర్నర్ ఇప్పటి వరకు ఆమోదం తెలపలేదు. ఈ అంశంపై గవర్నర్ తమిళిసై స్పందించారు. ఆర్టీసీ బిల్లు నిన్ననే తన వద్దకు వచ్చిందని చెప్పారు. బిల్లును పరిశీలించి న్యాయ సలహాలు తీసుకుంటానని, అందుకు కొంత సమయం కావాలన్నారు. మరోపక్క, తెలంగాణ ప్రభుత్వం ఈ బిల్లును ఈ అసెంబ్లీ సమావేశాల్లోనే ప్రవేశ పెట్టాలని భావించింది. 

More Telugu News