USA: దొంగతనానికి వచ్చిన నల్లజాతీయుడిని చావబాదిన ఎన్నారై.. వీడియో ఇదిగో!

Sikh Man Thrashes Robber After He Attempts To Loot Store In US
షార్ట్స్‌లో చూడండి
తన కిరాణా షాపులో దొంగతనానికి వచ్చిన నల్లజాతీయుడిని ఓ ఎన్నారై చావబాదిన ఘటనకు సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్‌గా మారింది. కాలిఫోర్నియాలోని ఓ సెవెన్ ఎలెవన్ షాపులోకి ఇటీవల ముసుగు ధరించిన ఓ వ్యక్తి దొంగతనానికి వచ్చాడు. కళ్లకు కనిపించిన వాటిని తన వెంట తెచ్చుకున్న ప్లాస్టిక్ బుట్టలో వేసుకోవడం ప్రారంభించాడు. ఆ షాపు ఓనర్ ఓ భారతీయుడే. ఈ క్రమంలో అతడు దొంగను పలుమార్లు వారించినా దొంగ మాత్రం వినలేదు. పైపెచ్చు, తనకు అడ్డురావద్దంటూ జేబులోంచి కత్తి చూపిస్తూ బెదిరించేందుకు ప్రయత్నించాడు. 

దొంగ జోలికి వెళ్లద్దంటూ ఎన్నారైని షాపులో ఉన్న మరో వ్యక్తి కూడా హెచ్చరించాడు. కానీ, తన కష్టం అలా దొంగలపాలవడం భరించలేకపోయిన ఆ ఎన్నారై ధైర్యం తెచ్చుకుని దొంగను కర్రతో చావబాదాడు. తొలుత దొంగను ఓ వ్యక్తి అడ్డుకుని కిందపడేసి కదలకుండా చేయగా రెండో వ్యక్తి కర్ర తీసుకుని కొట్టాడు. 

ఆ ఎన్నారై చేసిన పనికి నెట్టింట ప్రశంసల వర్షం కురుస్తోంది. రక్షణ కల్పించాల్సిన ప్రభుత్వం మిన్నకుండిపోతే ప్రజలే చట్టాన్ని తమ చేతుల్లోకి తీసుకుంటారని అనేక మంది హెచ్చరించారు. ఇటీవల కాలంలో అమెరికాలో ఇలాంటి దొంగతనాలు పెరిగిపోతున్నాయి. చిరు, మధ్యతరగతి వ్యాపారులే టార్గెట్‌గా మారుతున్నారంటూ అనేక మంది విచారం వ్యక్తం చేశారు.
Go Back to Shorts
USA
Viral Videos

More Telugu News