ఛేదనలో చివరి వరకు వచ్చి ఓడిపోయిన టీమిండియా
- స్వల్ప స్కోర్ల మ్యాచ్ లో విండీస్ దే పైచేయి
- తొలుత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసిన విండీస్
- ఛేదనలో 20 ఓవర్లలో 9 వికెట్లకు 145 పరుగులు చేసిన భారత్
- రాణించిన విండీస్ బౌలర్లు
- 39 పరుగులు చేసిన తిలక్ వర్మ
ఓపెనర్లు ఇషాన్ కిషన్ (6), శుభ్ మాన్ గిల్ (3) పరుగులకే అవుట్ కావడం టీమిండియా అవకాశాలపై తీవ్ర ప్రభావం చూపింది. సూర్యకుమార్ యాదవ్ 21, కెప్టెన్ హార్దిక్ పాండ్యా 19 పరుగులు చేశారు. సంజు శాంసన్ 12, అక్షర్ పటేల్ 13 పరుగులు చేశారు. విండీస్ బౌలర్లలో ఒబెద్ మెకాయ్ 2, జాసన్ హోల్డర్ 2, రొమారియో షెపర్డ్ 2, అకీల్ హోసీన్ ఒక వికెట్ తీశారు.
ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ మొదట బ్యాటింగ్ కు దిగి నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్లకు 149 పరుగులు చేసింది. స్వల్ప స్కోరే కదా... టీమిండియా ఈజీగా గెలుస్తుందని భావించినా, విండీస్ బౌలర్లు టీమిండియా బ్యాట్స్ మెన్ కు ఎక్కడా అవకాశం ఇవ్వలేదు.
ఈ విజయంతో 5 మ్యాచ్ ల టీ20 సిరీస్ లో వెస్టిండీస్ 1-0తో ముందంజ వేసింది. ఇక, ఇరు జట్ల మధ్య రెండో టీ20 మ్యాచ్ ఆగస్టు 6న గయానాలోని ప్రావిడెన్స్ స్టేడియంలో జరగనుంది.