ఢిల్లీ సర్వీసెస్ సవరణ బిల్లుకు లోక్ సభ ఆమోదం
- ఢిల్లీలో చట్టాలు చేసేలా కేంద్రానికి అధికారం
- ఢిల్లీ సర్వీసెస్ ఆర్డినెన్స్ కు సవరణ
- మంగళవారం నాడు లోక్ సభలో బిల్లు ప్రవేశపెట్టిన అమిత్ షా
- నేడు వాడీవేడిగా చర్చ
- అమిత్ షా ప్రసంగాన్ని వ్యతిరేకించిన విపక్షాలు... సభ నుంచి వాకౌట్
హోంమంత్రి అమిత్ షా చర్చలో భాగంగా ప్రసంగిస్తున్న సమయంలో విపక్ష సభ్యులు నిరసనలు తెలిపారు. కొద్దిసేపటి కిందట ఈ బిల్లుపై ఓటింగ్ నిర్వహించగా విపక్షాలు వాకౌట్ చేశాయి. ఎన్డీయే భాగస్వామ్య పక్షాల బలంతో కేంద్రం ఈ బిల్లును ఆమోదింపజేసుకుంది.