హర్యానాలో మత ఘర్షణలపై అమెరికా స్పందన
- హింసకు పాల్పడవద్దంటూ అన్ని వర్గాలకు అమెరికా విదేశాంగ శాఖ విజ్ఞప్తి
- శాంతియుత వాతావరణం నెలకొల్పేందుకు కృషి చేయాలని సూచన
- హర్యానాలో కొనసాగుతున్న ఉద్రిక్తతలు
- పలు ప్రాంతాల్లో ముందు జాగ్రత్తగా సెక్షన్ 144 విధించిన ప్రభుత్వం
- ఇంటర్నేట్ సేవలపై నిషేధం కొనసాగింపు
మరోవైపు, హింస ప్రజ్వరిల్లకుండా నిరోధించేందుకు హర్యానా ప్రభుత్వం పలు చర్యలు చేపడుతోంది. ఘర్షణలు ప్రారంభమైన నూహ్ జిల్లాతో పాటూ ఫరిదాబాద్, పల్వాల్, గురుగ్రామ్‌లోని మూడు సబ్డివిజన్లలో ఇంటర్నెట్ సేవలపై నిషేధం కొనసాగుతోంది. ఆగస్టు 5 వరకూ ఈ నిషేధం అమల్లో ఉంటుందని ప్రభుత్వం ప్రకటించింది. సోషల్ మీడియాలో తప్పుడు సమాచారం వ్యాప్తిని నిరోధించేందుకు నిషేధం అవసరమని పేర్కొంది. నూహ్‌తో పాటూ సమీపంలోని ఇతర జిల్లాల్లో ప్రభుత్వం భద్రతా ఏర్పాట్లను కట్టుదిట్టం చేసింది. ముందు జాగ్రత్త చర్యగా స్కూళ్లు, కాలేజీలకు సెలవులు ప్రకటించింది.