అమితాబ్‌ బచ్చన్‌పై అభిమానంతో అడ్డంగా దొరికిపోయిన దొంగ

  • మధ్యప్రదేశ్ ఇండోర్ నగరంలో ఘటన 
  • దొంగతనానికి వచ్చి ఇంటి గోడలపై బిగ్‌బీ డైలాగులు రాస్తూ తనని తానే మర్చిపోయిన దొంగ
  • అతడి చేతికి తగిలి కింద పడి పగిలిపోయిన అద్దం 
  • ఇంట్లో వాళ్లకు మెలకువ రావడంతో దొరికిపోయిన దొంగ
అమితాబ్ బచ్చన్‌పై వల్లమాలిన అభిమానం ఓ దొంగ కొంప ముంచింది. దొంగతనానికి వచ్చిన ఇంట్లో గోడలపై బిగ్‌బీ డైలాగులు రాస్తూ తనను తానే మర్చిపోయిన అతడు చివరకు పోలీసులకు పట్టుబడ్డాడు. మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ నగరంలో గల రిసాల ప్రాంతంలో ఆదివారం ఈ ఘటన వెలుగు చూసింది. 

ఆ రాత్రి విజయ్ యాదవ్, సోనూ యాదవ్ స్థానికంగా ఓ కార్పొరేటర్ ఇంట్లో చోరీ చేసేందుకు వచ్చారు. ఇంట్లో వారు గాఢ నిద్రలో ఉండగా తమ పని చక్కెబెట్టేసుకున్నారు. అక్కడ కొంత నగదు, నగలు లభించాయి. వాటితో సోనూ బయటపడ్డాడు. అయితే, విజయ్‌కు మాత్రం అమితాబ్ అంటే వల్లమాలిన అభిమానం. బిగ్ బీ సినిమాల్లోని డైలాగులు అంటే పిచ్చి. ఇక కార్పొరేటర్ ఇంట్లోని ఓ గోడ అద్భుతంగా కనిపించడంతో దానిపై అమితాబ్ మూవీ డైలాగులు అందంగా రాయాలని విజయ్ డిసైడయ్యాడు. 

ఇంట్లోని కొన్ని స్కెచ్ పెన్నులతో గోడపై సినీ డైలాగులు రాస్తుండగా చేతికి తగిలిన అద్దం కింద పడి పగిలిపోయింది. ఈ శబ్దానికి ఇంట్లో వారికి మెలకువ రావడంతో విజయ్ దొరికిపోయాడు. చివరకు పోలీసులు అతడిని అదుపులోకి తీసుకున్నారు. విజయ్‌తో పాటూ వచ్చిన సోనూ కోసం తీవ్రంగా గాలిస్తున్నారు.

Indore
Madhya Pradesh
Amitabh Bachchan

More Telugu News