Vande Bharat: హైదరాబాద్‌కు మూడో వందే భారత్‌ ఎక్స్ ప్రెస్

  • కాచిగూడ రైల్వే స్టేషన్ కు చేరుకున్న రైలు
  • హైదరాబాద్ - బెంగళూరు మధ్య సర్వీసు  
  • ఈ నెల 6న లేదా 15న ప్రధాని మోదీ ప్రారంభించే అవకాశం
Another Vande Bharat Express Train to Hyderabad

హైదరాబాద్ కు మరో వందే భారత్ వచ్చేసింది. ఇప్పటికే రెండు వందే భారత్ ఎక్స్ ప్రెస్ రైళ్లు విశాఖ, తిరుపతి రూట్లలో పరుగులు పెడుతున్నాయి. తాజాగా వచ్చిన వందే భారత్ రైలును హైదరాబాద్ - బెంగళూరు మధ్య నడిపించనున్నట్లు సమాచారం. ఈ ఎక్స్ ప్రెస్ రైలును ప్రధాని మోదీ ఈ నెల 6న లేదా 15న వర్చువల్ గా ప్రారంభిస్తారని రైల్వే అధికారులు చెబుతున్నారు. కాచిగూడ- యశ్వంత్ పూర్ స్టేషన్ల మధ్య పరుగులు తీయనున్న ఈ సెమీ బుల్లెట్ రైలు ప్రారంభోత్సవానికి ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు.

హైదరాబాద్‌ నుంచి బెంగళూరుకు రైలు ప్రయాణానికి ప్రస్తుతం సుమారు 11 గంటలు పడుతోంది. ఈ వందే భారత్ ఎక్స్ ప్రెస్ తో ప్రయాణ సమయం ఎనిమిదిన్నర గంటలకు తగ్గనుంది. ఈ రైలు కాచిగూడలో ఉదయం 6 గంటలకు బయలుదేరి మధ్యాహ్నం 2:30 గంటలకు బెంగళూరు చేరుకుంటుంది. తిరిగి మధ్యహ్నం 3 గంటలకు యశ్వంత్ పూర్ స్టేషన్ లో బయలుదేరి రాత్రి 11:30 గంటలకు కాచిగూడ చేరుకుంటుందని అధికారులు తెలిపారు.

More Telugu News