యూపీలో మరో దారుణం.. బాలికను వేధించి శానిటైజర్ తాగించిన యువకులు.. బాలిక మృతి
- స్కూలు నుంచి వస్తున్న బాలికను అడ్డుకుని వేధింపులు
- అడ్డుకునే ప్రయత్నం చేసిన ఆమె సోదరుడిపైనా దాడి
- మొత్తం ఘటనను వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేసిన వైనం
అదే సమయంలో అటువైపుగా వస్తున్న బాలిక సోదరుడు చూసి అడ్డుకునే ప్రయత్నం చేయగా, అతడిపై దాడిచేశారు. ఆ తర్వాత బాలికతో బలవంతంగా శానిటైజర్ తాగించారు. ఈ మొత్తం ఘటనను వారు వీడియో తీసి సోషల్ మీడియాలో అప్లోడ్ చేశారు. శానిటైజర్ తాగడంతో తీవ్ర అస్వస్థతకు గురైన బాలికను ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ నిన్న మృతి చెందింది. నిందితులపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.