హైదరాబాద్లో తెల్లవారుజాము నుంచి 15 చోట్ల ఈడీ దాడులు
- హైదరాబాద్ లో మరోసారి ఈడీ దాడుల కలకలం
- మాలినేని సాంబశివరావు నివాసంతో పాటు 15 చోట్ల దాడులు
- జూబ్లీహిల్స్, మణికొండ, పంజాగుట్ట ప్రాంతాల్లో కొనసాగుతున్న సోదాలు
కాకతీయ క్రిస్టల్ పవర్ లిమిటెడ్, టెక్నో యూనిట్ ఇన్ఫ్రాటెక్, ట్రాన్స్ ట్రై పవర్ ప్రాజెక్ట్, ట్రాన్స్ ట్రై రోడ్ ప్రాజెక్టులకు మాలినేని సాంబశివరావు డైరెక్టర్ గా ఉన్నారు. వివిధ బ్యాంకుల నుంచి తీసుకున్న రుణాలను ఈ సంస్థలు ఎగ్గొట్టినట్టు ఆరోపణలు ఉన్నాయి. అంతేకాదు, మనీ లాండరింగ్ కు పాల్పడినట్టు కూడా అభియోగాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే ఈడీ అధికారులు సోదాలను నిర్వహిస్తున్నట్టు తెలుస్తోంది.