పుతిన్ ఈర్ష్య పడేలా.. బేస్ బాల్ క్యాప్, ఏవియేటర్స్ తో షర్ట్ లేకుండా జోబైడెన్ పోజు!
- 80 ఏళ్ల వయసులో హాలీవుడ్ హీరోలా జోబైడెన్
- డెలావేర్ లోని రెహోబోత్ బీచ్ లో సరదాగా గడిపిన ప్రెసిడెంట్
- ఫొటో తీసి సోషల్ మీడియాలో షేర్ చేసిన ఒక జర్నలిస్ట్
రష్యా అధ్యక్షుడు పుతిన్ కు సంబంధించిన ఇలాంటి పలు ఫొటోలు ఎప్పుడో బయటకు వచ్చాయి. షర్ట్ లేకుండా, కండలు తిరిగిన శరీరంతో హార్స్ రైడింగ్ చేస్తున్న పుతిన్ ఫొటో ఇప్పటికీ ఒక సెన్సేషనే. ఈ విషయంలో అమెరికా మాజీ అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కూడా ఏ మాత్రం తగ్గలేదు. తాను అందరి కంటే బలవంతుడిని అని చెప్పేలా... హాలీవుడ్ సూపర్ స్టార్ సిల్వెస్టర్ స్టాలిన్ బాడీకి తన తలను జోడించిన ఫొటోను గతంలో ఆయన సోషల్ మీడియాలో షేర్ చేశారు.