నచ్చకపోతే నో చెప్పేస్తా..రూ.500 కోట్లు అయినా లెక్కచేయను: మాళవిక మోహనన్
- తన పాత్రకు ప్రాముఖ్యత లేకపోతే సినిమా ఒప్పుకోనన్న మాళవిక
- గుర్తింపు లేని పాత్రల్లో నటిస్తే ఉపయోగం ఉండదని అభిప్రాయపడ్డ నటి
- ఇకపై తన పాత్రకు ప్రాముఖ్యత ఉన్న సినిమాల్లోనే నటిస్తానని వెల్లడి
మోడలింగ్ నుంచి సినీ రంగ ప్రవేశం చేసిన మాళవిక నెట్టింట్లో నిత్యం యాక్టివ్ గా ఉంటుంది. తరచూ తన గ్లామరస్ ఫొటోలు షేర్ చేస్తుంటుంది. తొలిసారిగా తన మాతృభాష మలయాళంలో రూపొందిన 'పట్టం బోల' చిత్రంలో దుల్కర్ సల్మాన్ సరసన నటించింది. ఆ తరువాత రజినీకాంత్ నటించిన సూపర్ హిట్ చిత్రం 'పేట' ద్వారా కోలీవుడ్‌కు పరిచయమయ్యింది. తొలి చిత్రంతోనే అక్కడి ప్రేక్షకులను తనవైపుకు తిప్పుకుంది. ఆ తరువాత విజయ్ సరసన మాస్టర్, ధనుష్ పక్కన మారన్ చిత్రాల్లో నటించి మంచి విజయాలను అందుకుంది.