TTD: ఈసారి ఒకేసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలు: టీటీడీ ఈవో

  • ఈసారి శ్రీవారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉందన్న ఈవో
  • సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని వెల్లడి
  • ప్రభుత్వం తరఫున జగన్ పట్టువస్త్రాలు సమర్పిస్తారన్న ఈవో
TTD EO on Tirumala brahmothsavalu

ఈసారి తిరుమల శ్రీవెంకటేశ్వరస్వామి వారి బ్రహ్మోత్సవాలకు ఎంతో విశిష్టత ఉందని ఈవో ధర్మారెడ్డి అన్నారు. బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఆయన సోమవారం సమీక్ష నిర్వహించారు. అధికమాసం సందర్భంగా ఈసారి వార్షిక, నవరాత్రి బ్రహ్మోత్సవాలను ఒకేసారి నిర్వహించనున్నట్లు చెప్పారు. సెప్టెంబర్ 18న ధ్వజారోహణం ఉంటుందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి... స్వామివారికి పట్టువస్త్రాలు సమర్పిస్తారని చెప్పారు. రెండుస్లారు జరిగే బ్రహ్మోత్సవాలకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు వెల్లడించారు. బ్రహ్మోత్సవాల కారణంగా వీఐపీ బ్రేక్ దర్శనాలను రద్దు చేస్తున్నామన్నారు. స్వయంగా వచ్చే ప్రముఖలకు మాత్రమే బ్రేక్ దర్శనం కల్పిస్తామన్నారు. గరుడసేవకు వచ్చే ప్రతి ఒక్కరూ వాహనసేవను తిలకించేలా ఏర్పాటు చేస్తామని ఈవో తెలిపారు.

More Telugu News