ఏపీ అప్పులపై రఘురామకృష్ణరాజు ప్రశ్న.. వివరాలు వెల్లడించిన నిర్మలా సీతారామన్
- ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎంను పర్యవేక్షిస్తోందన్న ఆర్థికమంత్రి
- 2019 మార్చి నాటికి ఏపీ అప్పులు రూ.2,64,451 కోట్లుగా ఉన్నాయని వెల్లడి
- 2023 మార్చి నాటికి రూ.4,42,442కి చేరుకున్నాయన్న మంత్రి
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎఫ్ఆర్బీఎంను పర్యవేక్షిస్తోందని ఆమె తెలిపారు. ఫైనాన్స్ కమిషన్ సిఫార్సులకు లోబడి రాష్ట్రం అప్పులు చేస్తోందని స్పష్టం చేశారు. 2019 మార్చి నాటికి ఆంధ్రప్రదేశ్ అప్పులు రూ.2,64,451 కోట్లు కాగా, 2023 మార్చి నాటికి రూ.4,42,442 కోట్లకు పెరిగినట్లు వెల్లడించారు. గత నాలుగేళ్లలో ప్రస్తుత ప్రభుత్వం చేసిన అప్పులు రూ.1,77,991 కోట్లుగా తేల్చారు.
