పిఠాపురంలో ఒకే ఇంటి నంబరులో వందలాది ఓట్లు.. నిజమేనన్న అధికారులు

448 Votes in one house number in Pithapuram
  • 1-2-63 ఇంటి నంబరుపై 448 ఓట్లు
  • రంగంలోకి అధికారులు
  • ఇంటింటికీ తిరిగి వివరాలు సేకరిస్తున్న ఫాం-8 స్వీకరణ
  • త్వరలోనే కచ్చితమైన ఓటర్ల జాబితా ప్రచురణ
కాకినాడ జిల్లా పిఠాపురంలో ఒకే ఇంటి నంబరుతో వందలాది ఓట్లు ఉండడం అధికారులనే ఆశ్చర్యపరిచింది. పట్టణ పరిధిలోని అగ్రహారం 125వ బూత్‌లోని 1-2-63 ఇంటి నంబరుపై 448 ఓట్లు నమోదయ్యాయి. దీనిపై విమర్శలు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు ఓటర్ల ఆధార్, ఇంటి నంబర్లను పరిశీలిస్తున్నారు.

ఒకే ఇంటి నంబరుపై వందలాది ఓట్లు ఉండడం నిజమేనని ఎన్నికల అధికారి సుబ్బారావు తెలిపారు. ప్రస్తుతం ఇంటింటికీ వెళ్లి ఫాం-8 తీసుకుంటున్నట్టు చెప్పారు. 448 ఓట్లలో ఎంతమంది ఉంటున్నారు? ఎంతమంది లేరనే వివరాలను నమోదు చేస్తున్నట్టు పేర్కొన్నారు. తప్పొప్పులు సవరించి కచ్చితమైన ఓటర్ల జాబితాను త్వరలోనే ప్రచురిస్తామని తెలిపారు.
Go Back to Shorts
Pithapuram
Kakinada District
Voter List

More Telugu News