Team India: రెండో వన్డేలో టీమిండియా స్వల్ప స్కోరుకే ఆలౌట్

Team India all out for 181 runs in 2nd ODI
షార్ట్స్‌లో చూడండి
బ్రిడ్జ్ టౌన్ లో వెస్టిండీస్ తో రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించడంలో విఫలమైంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన వెస్టిండీస్ బౌలింగ్ ఎంచుకోగా, టీమిండియా మొదట బ్యాటింగ్ కు దిగింది. అయితే విండీస్ బౌలర్లు విజృంభించడంతో భారత్ 40.5 ఓవర్లలో 181 పరుగులకే ఆలౌట్ అయింది. 

ఓపెనర్లు ఇషాన్ కిషన్ (55), శుభ్ మాన్ గిల్ (34) తొలి వికెట్ కు 90 పరుగులు జోడించి శుభారంభం అందించినా, మిగతా బ్యాట్స్ మెన్ ఆ ఒరవడి కొనసాగించలేకపోయారు. ఓ దశలో వర్షం వల్ల మ్యాచ్ ఆగిపోగా, వర్షం తగ్గి మ్యాచ్ మళ్లీ మొదలైనా భారత్ వికెట్ల పతనం మాత్రం ఆగలేదు. 

మిడిలార్డర్ లో సూర్యకుమార్ 24 పరుగులు చేశాడు. శార్దూల్ ఠాకూర్ 16, రవీంద్ర జడేజా 10 పరుగులు చేశారు. సంజు శాంసన్ (9), అక్షర్ పటేల్ 1, తాత్కాలిక కెప్టెన్ హార్దిక్ పాండ్యా (7) విఫలమయ్యారు. విండీస్ బౌలర్లలో గుడాకేశ్ మోతీ 3, రొమారియో షెపర్డ్ 3, అల్జారీ జోసెఫ్ 2, జేడెన్ సీల్స్ 1, యానిక్ కరియా 1 వికెట్ తీశారు.
Go Back to Shorts
Team India
2nd ODI
West Indies
Bridgetown

More Telugu News