త్వరలో హెచ్-1బీ వీసా లాటరీ రెండో రౌండ్
- 2024 ఆర్థిక సంవత్సరం కోటా భర్తీకి మరో రౌండ్ లాటరీ నిర్వహించనున్న అమెరికా
- గతంలో ఎలక్ట్రానిక్ పద్ధతిలో దాఖలైన వాటిల్లోంచి ర్యాండమ్ పద్ధతిలో రిజిస్ట్రేషన్ల ఎంపిక
- మార్చిలో తొలి రౌండ్ నిర్వహణ
- భారతీయ టెకీలకు లాభించనున్న అమెరికా నిర్ణయం
హెచ్-1బీ వీసాల తొలి లాటరీ రౌండ్ మార్చిలో జరిగింది. అమెరికా ఏటా 65 వేల వీసాలను జారీ చేస్తుంటుంది. అమెరికా యూనివర్సిటీల్లో స్టెమ్ కోర్సులు చేసిన విదేశీయుల కోసం మరో 20 వేల హెచ్-1బీ వీసాలు అందుబాటులో ఉంటాయి. అమెరికా తాజా నిర్ణయంతో భారతీయ టెకీలకు లాభదాయకమన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి.