ఎమ్మెల్సీ కవిత పిటిషన్‌ను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు
- మహిళలను ఈడీ కార్యాలయంలో విచారించడాన్ని కోర్టులో సవాల్ చేసిన కవిత
- ఆరువారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని ఈడీకి అత్యున్నత న్యాయస్థానం ఆదేశాలు
- కవిత తరఫున కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గీ వాదనలు
మహిళలను దర్యాఫ్తు సంస్థల ఆఫీసుల్లో ఎలా విచారిస్తారని కవిత పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ పిటిషన్‌పై కవిత తరఫున సీనియర్ న్యాయవాదులు కపిల్ సిబాల్, ముకుల్ రోహిత్గీ వాదనలు వినిపించారు. విచారణకు తెలంగాణ ప్రభుత్వం తరఫున అదనపు అడ్వోకేట్ జనరల్ జె.రామచంద్రరావు హాజరయ్యారు. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కవితను దర్యాఫ్తు సంస్థలు విచారించిన విషయం తెలిసిందే.