నిర్మలా సీతారామన్ తో భేటీ విజయవంతంగా జరిగింది: పురందేశ్వరి
- ఢిల్లీలో కేంద్ర ఆర్థికమంత్రిని కలిసిన ఏపీ బీజేపీ చీఫ్
- ఏపీ ప్రభుత్వం అప్పులు చేస్తోందని నిర్మలకు తెలిపిన పురందేశ్వరి
- ఆ భారం ప్రజలపై మోపుతున్నారని వెల్లడి
- నిర్మలకు వినతిపత్రం అందజేత
కేంద్రమంత్రి నిర్మలా సీతారామన్ తో సమావేశం ఫలప్రదంగా ముగిసిందని తెలిపారు. "ఏపీలో వైసీపీ ప్రభుత్వం చేస్తున్న నిధుల మళ్లింపును నిర్మల దృష్టికి తీసుకెళ్లాను. ప్రభుత్వం విచక్షణ రహితంగా అప్పులు చేసి, ఆ భారాన్ని రాష్ట్రంపై, ప్రజలపై మోపుతున్న వైనాన్ని ఆమెకు వివరించాను. నిర్మలా సీతారామన్ ను నేను కలిసిన ఉద్దేశం నెరవేరింది" అని పురందేశ్వరి పేర్కొన్నారు.