బీజేపీకి అండగా వైసీపీ.. వివాదాస్పద బిల్లుకు అనుకూలంగా రాజ్యసభలో ఓటేసేందుకు రెడీ!
- తొలి నుంచీ బీజేపీకి మిత్రపక్షంగా వ్యవహరిస్తూ వస్తున్న వైసీపీ
- రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు
- క్లిష్ట సమయాల్లో కేంద్రాన్ని ఆదుకుంటున్న వైసీపీ
- ప్రతిపక్షాల అవిశ్వాస తీర్మానం నేపథ్యంలో ప్రభుత్వానికి అండగా ఉంటామన్న విజయసాయి
వైసీపీకి రాజ్యసభలో 9 మంది, లోక్‌సభలో 22 మంది సభ్యులు ఉన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టే కీలక బిల్లుల సమయంలో వీరంతా అండగా నిలుస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో ఢిల్లీ ప్రభుత్వాన్ని తమ చెప్పుచేతల్లో పెట్టుకునేందుకు ప్రభుత్వం తీసుకొచ్చిన వివాదాస్పద సేవల నియంత్రణ బిల్లుకు లోక్‌సభలో ఆమోదం లభించినా రాజ్యసభలో తగినంత మెజారిటీ లేకపోవడంతో అక్కడ చిక్కుకుపోయే అవకాశం ఉంది.
ఈ నేపథ్యంలో రాజ్యసభలో బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేయడం ద్వారా దానిని బయటపడేయాలని చూస్తోంది. వైసీపీ రాజ్యసభ సభ్యుడు విజయసాయిరెడ్డి ‘ఎన్‌డీటీవీ’తో మాట్లాడుతూ ఈ విషయంలో మరింత స్పష్టతనిచ్చారు. అవిశ్వాస తీర్మానానికి వ్యతిరేకంగా, బిల్లుకు అనుకూలంగా ఓట్లు వేస్తామని ఆయన స్పష్టం చేశారు.