బీజేపీతో పొత్తుపై తేల్చేసిన మాజీ ప్రధాని దేవెగౌడ
- లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ-జేడీఎస్ కలిసి వెళ్తాయనే ప్రచారాన్ని తిప్పికొట్టిన దేవెగౌడ
- ఒకటిరెండు సీట్లు వచ్చినా స్వతంత్రంగానే పోటీ చేస్తామని స్పష్టీకరణ
- నాటి పరిస్థితులను బట్టి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని ట్విస్ట్
తాము లోక్ సభ ఎన్నికల్లో ఒంటరిగానే పోటీ చేస్తామన్నారు. ఒకటి రెండు సీట్లు వచ్చినా సరే స్వతంత్రంగా పోటీ చేస్తామన్నారు. పార్టీలో సంప్రదింపుల అనంతరం బలంగా ఉన్న స్థానాల్లో అభ్యర్థులను బరిలోకి దింపుతామన్నారు. అదే సమయంలో నాటి పరిస్థితులను బట్టి భవిష్యత్తు కార్యాచరణను నిర్ణయిస్తామని కూడా మరో మాట చెప్పారు. ఇటీవల బెంగళూరులో నిర్వహించిన ప్రతిపక్షాల సమావేశానికి తనను ఆహ్వానించినప్పటికీ, రాష్ట్ర కాంగ్రెస్ లోని ఓ వర్గం వ్యతిరేకించినట్లు చెప్పారు.