శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న స‌దా 'నంద‌'
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

శ‌ర‌వేగంగా షూటింగ్ జరుపుకుంటోన్న స‌దా 'నంద‌'

Nanda movie shooting continues with brisk pace
  • సదా హీరోగా స్వీయ దర్శకత్వంలో 'నంద'
  • హైదరాబాద్ పరిసరాల్లో చిత్రీకరణ
  • తాజాగా ఫస్ట్ లుక్ విడుదల
స‌దా సినిమా, స్కై ఆర్ట్స్ ప‌తాకాల‌పై గోనుగుంట్ల విజ‌య్ కుమార్ స‌మ‌ర్ప‌ణ‌లో స‌దా హీరోగా న‌టిస్తూ స్వీయ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం 'నంద‌'. క‌ళ్యాణ్ ఎర్ర‌గుంట్ల నిర్మిస్తోన్న ఈ చిత్రం ప్ర‌స్తుతం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో శ‌ర‌వేగంగా షూటింగ్ జ‌రుపుకుంటోంది. ఈ సంద‌ర్భంగా ఈ చిత్రానికి సంబంధించిన ఫ‌స్ట్ లుక్  లాంచ్ చేశారు. దీనికి సంబంధించి చిత్ర క‌థానాయ‌కుడు, ద‌ర్శ‌కుడు సదా స్పందించారు. 

"నేను హీరోగా న‌టిస్తూ 'నంద‌' చిత్రాన్ని డైర‌క్ట్ చేస్తున్నా. మ‌ద‌ర్ సెంటిమెంట్ నేప‌థ్యంలో సాగే యాక్ష‌న్ ఎంట‌ర్ టైనర్ చిత్ర‌మిది. అన్ని వ‌ర్గాల ప్రేక్ష‌కుల‌కు న‌చ్చే విధంగా తెర‌కెక్కిస్తున్నాం. ప్ర‌స్తుతం మా చిత్రం హైద‌రాబాద్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ జ‌రుపుకుంటోంది. చ‌ర‌ణ్ అర్జున్ మా చిత్రానికి నాలుగు అద్భుత‌మైన పాట‌లు స‌మ‌కూర్చారు. త్వ‌ర‌లో పూర్తి వివ‌రాలు వెల్ల‌డిస్తాం" అని తెలిపారు.
Advertisement
Nanda
Sada
First Look
Tollywood

More Telugu News