స్వల్పంగా పెరిగిన ఈపీఎఫ్ఓ వడ్డీ రేటు.. త్వరలో ఖాతాల్లో జమ
- 8.10 శాతం నుండి 8.15 శాతానికి పెంచిన ప్రభుత్వం
- 0.05 శాతం పెంచుతూ సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ తీసుకున్న నిర్ణయానికి కేంద్రం ఓకే
- సోమవారం అధికారిక ఉత్తర్వుల జారీ
ఈ నిర్ణయాన్ని సెంట్రల్ బోర్డ్ ట్రస్టీ.. కేంద్ర ఆర్థిక శాఖకు పంపించి, ఆమోదం లభించడంతో సోమవారం ప్రకటన జారీ చేసింది. దీంతో ఆరుకోట్ల మంది ఈపీఎఫ్ మెంబర్లకు ప్రయోజనం చేకూరుతుంది. సోమవారం జారీ చేసిన అధికారిక ఉత్తర్వు ప్రకారం... ఈపీఎఫ్ఓ త్వరలో 2022-23 వడ్డీ మొత్తాన్ని సభ్యుల ఖాతాల్లో జమ చేయనుంది.
ఈపీఎఫ్ఓ ఫీల్డ్ కార్యాలయాలు 8.15 శాతం చొప్పున వడ్డీని చందాదారుల ఖాతాల్లో జమ చేసే ప్రక్రియను ప్రారంభిస్తాయి. మార్చి 2022లో ఈపీఎఫ్ఓ 2021-22 వడ్డీ రేటును 8.5 శాతం నుండి నాలుగు దశాబ్దాల కనిష్ఠం 8.10 శాతానికి తగ్గించింది.ఈపీఎఫఓ వడ్డీ రేటు 1977-78లో 8 శాతంగా ఉంది. ఆ తర్వాత 2021-22 వడ్డీ రేటే కనిష్ఠం. గత ఆర్థిక సంవత్సరానికి మాత్రం 0.05 శాతం పెంచింది.