చెరువులో పడిన బస్సు.. 17 మంది జల సమాధి
- బంగ్లాదేశ్లో ఘటన
- ప్రమాద సమయంలో బస్సులో 70 మంది
- ఆటోకు సైడ్ ఇస్తుండగా అదుపుతప్పిన బస్సు
- మరో 35 మందికి తీవ్ర గాయాలు
స్థానిక యూనియన్ పరిషత్ కార్యాలయం సమీపంలో ఆటో రిక్షాకు సైడ్ ఇస్తుండగా ఈ ఘటన జరిగినట్టు పోలీసులు తెలిపారు. క్షతగాత్రులను ఝలకతి జిల్లా ఆసుపత్రికి తరలించారు. బస్సులో పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం, డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.