Milky Beauty: చిరంజీవి 'భోళాశంకర్' నుంచి 'మిల్కీ బ్యూటీ' సాంగ్ లిరికల్ వీడియో విడుదల

  • మెగాస్టార్ చిరంజీవి హీరోగా భోళాశంకర్
  • మెహర్ రమేశ్ దర్శకత్వంలో మాస్ ఎంటర్టయినర్ మూవీ
  • ఆగస్టు 11న విడుదల
Mliky Beauty song lyrical video from Bhola Shankar out now

మెగాస్టార్ చిరంజీవి, దర్శకుడు మెహర్ రమేశ్ కాంబోలో వస్తున్న మాస్ ఎంటర్టయినర్ చిత్రం భోళాశంకర్ నుంచి మరో సాంగ్ విడుదలైంది. మిల్కీ బ్యూటీ నువ్వే నా స్వీటీ అంటూ సాగే ఈ పాట లిరికల్ వీడియోను చిత్రబృందం పంచుకుంది. మహతి స్వరసాగర్ బాణీలకు రామజోగయ్యశాస్త్రి సాహిత్యం అందించారు. మహతి స్వరసాగర్, విజయ్ ప్రకాశ్, సంజన కల్మాంజే ఆలపించారు. 

ఏకే ఎంటర్టయిన్ మెంట్స్ బ్యానర్ పై రామబ్రహ్మం సుంకర నిర్మాణంలో తెరకెక్కుతున్న భోళాశంకర్ ఆగస్టు 11న ప్రేక్షకుల ముందుకు వస్తోంది. ఇందులో చిరంజీవి సరసన తమన్నా హీరోయిన్ గా నటిస్తోంది. కీర్తి సురేశ్ చిరంజీవి చెల్లెలి పాత్ర పోషిస్తుండడం విశేషం. ఇందులో సుశాంత్, వెన్నెల కిశోర్, తరుణ్ అరోరా, మురళి శర్మ, బ్రహ్మాజీ, శ్రీముఖి, గెటప్ శ్రీను, హైపర్ ఆది తదితరులు నటిస్తున్నారు. 

భోళాశంకర్ చిత్రం నుంచి ఇప్పటికే భోళా మేనియా, జాం జాం జజ్జనక గీతాలు రిలీజ్ అయ్యాయి. ఆడియన్స్ నుంచి వీటికి విశేష స్పందన లభిస్తోంది.

More Telugu News