బాస్ లేటుగా వచ్చాడని.. ఇంటర్వ్యూను బహిష్కరించిన ఉద్యోగార్థి

21-07-2023 Fri 10:46 | Offbeat
Advertisement
  • తనకు ఉద్యోగావసరం ఎంత ఉందో తేల్చేందుకు కంపెనీ ఈ పరీక్ష పెట్టారన్న అభ్యర్థి
  • ఆ జాబ్‌లో చేరి ఉంటే వేధింపుల బారిన పడి ఉండేవాడినని వెల్లడి
  • ఉద్యోగార్థి వింత చర్య నెట్టింట వైరల్
Advertisement
బాస్ సమక్షంలో ఏ ఉద్యోగి అయినా ఒద్దికగా, అలర్ట్‌గా ఉంటాడు. బాస్ ఈజ్ ఆల్వేస్ రైట్ అన్నట్టు నడుచుకుంటాడు. ఇక ఉద్యోగ ప్రయత్నాల్లో ఉన్న అభ్యర్థుల వినయవిధేయతల గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. కానీ మనం చెప్పుకోబోయే వ్యక్తి మాత్రం కాస్త డిఫరెంట్. ఓ కంపెనీలో ఇంటర్వ్యూకు వెళ్లిన అతడు, బాస్ ఓ పదిహేను నిమిషాలు లేటుగా వచ్చాడని ఇంటర్వ్యూను బహిష్కరించాడు. ప్రస్తుతం ఈ ఉదంతం నెట్టింట వైరల్‌గా మారింది. 

నెటిజన్లు తొలుత మనోడి కాన్ఫిడెన్స్ చూసి తెగ ముచ్చపడిపోయారు. అయితే, అతడు తన నిర్ణయానికి గల అసలు కారణం వివరించడంతో నెట్టింట మరో చర్చ మొదలైంది. తన అనుభవాన్ని వివరిస్తూ మనోడు ఇలా రాసుకొచ్చాడు. 

‘‘మధ్యాహ్నం 2.30 గంటలకు ఇంటర్వ్యూ కోసం ఆఫీసులో కాలుపెట్టా. అప్పుడే నాకు డైరెక్టర్‌తో అపాయింట్‌మెంట్ దొరికింది. బాస్ మరో నిమిషంలో వస్తారని రిసెష్షన్‌లో ఉన్న సిబ్బంది చెప్పారు. కానీ, 15 నిమిషాలు గడిచినా ఆయన రాలేదు. సరిగ్గా 2.45కి నేను నాదారిన బయటకు వచ్చేశా. మళ్లీ వెనక్కు తిరిగి కూడా చూడలేదు. నా రంగంలో ఉన్న పరిస్థితులు ఏంటో నాకు తెలుసు. నన్ను ఇంత సేపు వేచి చూసేలా చేయాల్సిన పరిస్థితులేం లేవు. ఈ మొత్తం వ్యవహారాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే డేంజర్ బెల్స్ వినిపించాయి. నాకు సహనం ఎంత ఉందో పరీక్షించేందుకు ఇలా చేశారు. నాకు ఉద్యోగం అవసరం ఎంత ఉందనేది ఇలా తెలుసుకోవాలనుకున్నారు. ఈ పరిస్థితుల్లో అక్కడ చేరితే నాకు ఇబ్బందులు తప్పవు’’ అంటూ రాసుకొచ్చాడు.

 కాగా, ఉద్యోగార్థి చర్యతో అనేక మంది ఏకీభవించారు. ఆలస్యం జరిగే అవకాశం ఉన్నప్పుడు ఆ విషయాన్ని కచ్చితంగా చెప్పడం కనీస మర్యాదని అనేక మంది కామెంట్ చేశారు.
Advertisement
Social Media

More Telugu News

చాట్‌జీపీటీ, జెమినీలకు ఎమోషన్స్ అర్థం కావు.. 13 ఏళ్ల బాలిక తేల్చేసింది!

24-10-2026 Sat 20:40

ఒక్క ఓవర్‌ చాలు.. మ్యాచ్ మనవైపు తిప్పుకోవచ్చని నమ్మాం: నితీశ్ కుమార్ రెడ్డి

24-10-2026 Sat 20:39

భారత రైలులో ఏసీ కూపే.. కొన్ని హోటల్ గదుల కన్నా విశాలంగా ఉందన్న విదేశీ జంట.. వీడియో ఇప్పుడు వైరల్

24-10-2026 Sat 20:19

గూగుల్‌లో జాబ్ కావాలా? రెజ్యూమె నుంచి ఇంటర్వ్యూ వరకు.. రిక్రూటర్ చెప్పిన 5 కీలక సూచనలు

24-10-2026 Sat 20:12

"నువ్వుంటే చాలు గెలుస్తాం".. కోచ్‌ల నమ్మకాన్ని నిలబెట్టిన తిలక్ వర్మ

24-10-2026 Sat 20:07

భారత్‌లో ఈ 10 విషయాలు అద్భుతం: ఫిదా అయిన ఫిన్లాండ్ ఫ్యామిలీ!

24-10-2026 Sat 19:55

ఎవరి శాంతి కోసం నేను సంతకం చేయాలి?: నేహా బోరా ఫైర్

24-10-2026 Sat 19:14

'ఇండియా' కూటమి ర్యాలీ వద్దు.. రూ. 10,000 కోట్ల నష్టం వస్తుంది!: రాహుల్ గాంధీకి వ్యాపారుల విజ్ఞప్తి

24-10-2026 Sat 19:13

ఏఐ రంగంలో ప్రస్తుత హడావుడి ఓ బుడగ: జోహో శ్రీధర్ వెంబు

24-10-2026 Sat 18:59

వైసీపీ పాలనలో మున్సిపాలిటీలు సర్వనాశనం.. ఇప్పుడు ఓట్లు ఎలా అడుగుతారు?: పర్చూరి అశోక్ బాబు

24-10-2026 Sat 18:55

పంజాబ్‌లో కారు బీభత్సం.. టోల్ ఉద్యోగిని బానెట్‌పై ఈడ్చుకెళ్లిన డ్రైవర్

24-10-2026 Sat 18:44

సౌదీలో చిక్కుకున్న ఉమ్రా యాత్రికులు.. రంగంలోకి దిగిన ప్రభుత్వాలు

24-10-2026 Sat 18:30

షర్మిలకు జగన్ లేఖ.. మేనకోడలి పెళ్లికి బెంగళూరు ఇల్లు వద్దని స్పష్టీకరణ

24-10-2026 Sat 18:21

పాకిస్థాన్ వల్లే కశ్మీరీలు బతుకుతున్నారు: ఫరూఖ్ అబ్దుల్లా సంచలన వ్యాఖ్యలు

24-10-2026 Sat 18:17

ఓ ఉబెర్ డ్రైవర్ సరికొత్త మోసం.. ఫేక్ స్క్రీన్‌షాట్‌తో రెట్టింపు చార్జీ వసూలుకు యత్నం!

24-10-2026 Sat 18:15
..more