Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

సాయి ధరమ్ తేజ్ షాకింగ్ నిర్ణయం.. 6 నెలల పాటు సినిమాలకు దూరం

Sai Dharam Tej taking 6 months break from movies
Advertisement
  • యాక్సిడెంట్ తర్వాత కోలుకున్నప్పటికీ ఫిజికల్ గా ఇబ్బంది పడుతున్న తేజూ
  • చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని వెల్లడి
  • సర్జరీ కారణంగా కొత్త సినిమా కథలను కూడా వినలేదన్న మెగా హీరో
Advertisement
మెగా హీరో సాయి ధరమ్ తేజ్ షాకింగ్ డెసిషన్ తీసుకున్నాడు. సినిమాల నుంచి ఆయన లాంగ్ గ్యాప్ తీసుకోనున్నాడు. 6 నెలల పాటు సినిమాలకు దూరంగా ఉండనున్నట్టు ప్రకటించాడు. యాక్సిడెంట్ నుంచి కోలుకున్న తర్వాత తేజూ రెండు సినిమాలలో నటించాడు. రీఎంట్రీ తర్వాత వచ్చిన 'విరూపాక్ష' చిత్రం ఘన విజయం సాధించింది. తాజాగా తన మేనమామ, జనసేనాని పవన్ కల్యాణ్ తో కలిసి నటించిన 'బ్రో' ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది. 

యాక్సిడెంట్ నుంచి కోలుకున్నప్పటికీ ఫిజికల్ గా తేజూ ఇబ్బంది పడుతున్నాడు. ఈ నేపథ్యంలోనే సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలని నిర్ణయించుకున్నాడు. తాను ఒక చిన్న సర్జరీ చేయించుకోవాల్సి ఉందని తేజూ చెప్పాడు. సర్జరీ తర్వాత మరింత బలంగా, పూర్తి ఫిట్ నెస్ తో అభిమానుల ముందుకు వస్తానని తెలిపాడు. దీనికి ఆరు నెలల సమయం పట్టవచ్చని చెప్పాడు. సర్జరీ కారణంగా కొత్తగా సినిమా కథలను కూడా వినలేదని తెలిపాడు. బ్రేక్ తర్వాత దర్శకుడు సంపత్ నంది సినిమాలో నటిస్తానని వెల్లడించాడు. మరోవైపు, సమంత కూడా చికిత్స కోసం ఒక ఏడాది పాటు బ్రేక్ తీసుకున్న సంగతి తెలిసిందే.
Advertisement
Advertisement
Sai Dharam Tej
Tollywood
Break

More Telugu News