USA: అమెరికాలో పిడుగుల ధాటికి వేలాది విమానాల నిలిపివేత

  • అమెరికాలో ఓవైపు అధిక ఉష్ణోగ్రతలు
  • మరోవైపు భారీ వర్షాలు, వరదలు
  • ఈశాన్య అమెరికా రాష్ట్రాల్లో పిడుగులు
  • నిలిచిపోయిన 2,600 విమానాలు
  • మరో 8 వేల విమానాల రీషెడ్యూల్
US has been hit by lightening as thousands of flights cancelled and rescheduled

అగ్రరాజ్యం అమెరికాలో ఓవైపు అధిక వేడిమి, మరోవైపు భారీ వర్షాలు, పిడుగులు అతలాకుతలం చేస్తున్నాయి. టోర్నడోలు అత్యధికంగా సంభవించే దేశమైన అమెరికాలో ఇప్పుడు పిడుగులు బీభత్సం సృష్టిస్తున్నాయి. తాజాగా, పిడుగుల ధాటికి అమెరికాలో వేలాది విమానాలు నిలిపివేశారు. 2,600 విమానాలు రద్దు కాగా, మరో 8 వేల విమాన సర్వీసులను రీషెడ్యూల్ చేశారు. 

అమెరికా ఈశాన్య రాష్ట్రాల్లో పిడుగుల ప్రభావం అధికంగా ఉంది. ఈశాన్య ప్రాంతంలోనే 1,320 విమానాలు నిలిపివేశారు. దాంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. విమానాలు ఆలస్యంగా నడుస్తుండడంతో విమానాశ్రయాల్లోనే పడిగాపులు కాస్తున్నారు. 

కాగా, ఈశాన్య అమెరికా రాష్ట్రాలకు జాతీయ వాతావరణ సంస్థ భారీ వర్ష సూచన చేసింది. భారీ వర్షాలతో ఆకస్మికంగా వరదలు వచ్చే అవకాశం ఉందని హెచ్చరించింది. అదే సమయంలో, మారిన వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో టోర్నడోల పట్ల కూడా అప్రమత్తంగా ఉండాలని పేర్కొంది. మరికొన్ని రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని తెలిపింది.

More Telugu News