ఐర్లాండ్ టూర్‌తో బుమ్రా రీ ఎంట్రీ.. ద్రవిడ్ సహా కోచింగ్ స్టాఫ్‌కు విశ్రాంతి
- వచ్చే నెల 18 నుంచి ఐర్లాండ్‌లో పర్యటించనున్న భారత జట్టు
- ద్రవిడ్ స్థానంలో వీవీఎస్ లక్ష్మణ్‌కు బాధ్యతలు
- శ్రేయాస్ అయ్యర్ రాకపై లేని స్పష్టత
ఐర్లాండ్ టూర్‌లో భాగంగా ఆగస్టు 18న తొలి టీ20 జరగనుండగా 20, 23న రెండు, మూడు మ్యాచ్‌లు జరగుతాయి. మూడు మ్యాచ్‌లు డబ్లిన్‌లోనే జరగనున్నాయి. గాయంతో చాలా కాలంగా జట్టుకు దూరమైన స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఈ సిరీస్‌తో తిరిగి జట్టులోకి వచ్చే అవకాశం ఉంది. కేఎల్ రాహుల్ అందుబాటులో ఉండడం లేదు. శ్రేయాస్ అయ్యర్ విషయంలో ఇంకా స్పష్టత రాలేదు.