పాకిస్థాన్ ఇండియాలో ఆడాల్సిందే: మిస్బా ఉల్ హక్
- పాకిస్థాన్, ఇండియా మధ్య క్రికెట్ ను రాజకీయాలతో ఎందుకు ముడిపెడతారన్న మిస్బా
- రెండు దేశాల మధ్య జరిగే మ్యాచ్ ల మజాను అభిమానులకు దూరం చేయకూడదని వ్యాఖ్య
- ఇండియాలో ఆడితే కలిగే ఒత్తిడిని తాను ఆస్వాదించానన్న మిస్బా
ఈ నేపథ్యంలో, పాక్ మాజీ క్రికెటర్, మాజీ కోచ్ మిస్బా ఉల్ హక్ స్పందించాడు. క్రికెట్ ను రాజకీయాలతో ఎందుకు ముడిపెడతారని ప్రశ్నించాడు. ఇతర క్రీడల విషయంలో పాక్, ఇండియాకు మధ్య సంబంధాలు ఉన్నప్పుడు... క్రికెట్ విషయంలో సంబంధాలు ఎందుకు లేవని అడిగాడు. ఈ రెండు దేశాల మధ్య జరిగే క్రికెట్ పోరు ఉత్కంఠ భరితంగా ఉంటుందని... ఆ మజాను ఆస్వాదించే అవకాశాన్ని ఇరు దేశాల క్రికెట్ ప్రేమికులకు దూరం చేయకూడదని చెప్పాడు. ఇది ఇరు దేశాల క్రికెట్ అభిమానులకు అన్యాయం చేయడమే అవుతుందని అన్నాడు.