ఫ్రాన్స్ అధ్యక్ష భవనానికి పార్శిల్... విప్పి చూస్తే...!
- ఎలిసీ ప్యాలెస్ కు తెగిన వేలుతో కూడిన పార్శిల్
- విప్పి చూసి హడలిపోయిన అధికారులు
- మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి ఈ ప్యాకెట్ పంపి ఉంటాడని అనుమానం
- ఇటీవల ఫ్రాన్స్ లో విస్తృత స్థాయిలో అల్లర్లు
- ఆ కోణంలోనూ దర్యాప్తు చేస్తున్న పోలీసులు
ఇటీవల ఫ్రాన్స్ లో అరాచక పరిస్థితులు చోటుచేసుకున్నాయి. పోలీసుల కాల్పుల్లో ఓ టీనేజి కుర్రాడు మరణించాడు. ఫ్రాన్స్ లో రోజుల తరబడి హింసాత్మక ఘటనలు జరిగాయి. ఈ నేపథ్యంలోనే మేక్రాన్ అధికారిక నివాసానికి తెగిన వేలుతో కూడిన పార్శిల్ వచ్చి ఉంటుందని భావిస్తున్నారు. కాగా, మానసిక స్థితి సరిగా లేని వ్యక్తి తన వేలును తానే కోసుకుని, దాన్ని మేక్రాన్ కు పంపినట్టు ప్రాసిక్యూషన్ విభాగం భావిస్తోంది. ఈ ఘటనపై పోలీసుల దర్యాప్తు కొనసాగుతోంది.