తెలంగాణపై బీజేపీ ఫోకస్.. 119 అసెంబ్లీ నియోజకవర్గాల్లో సభలు
- ఈ నెల 15 నుంచి 31 వరకు నిర్వహించాలని నిర్ణయం
- ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజక వర్గాలకు తొలి ప్రాధాన్యత
- సభలకు హాజరు కానున్న రాష్ట్ర నాయకత్వం
రేపటి నుంచి ఈ నెల 31వ తేదీ వరకు రాష్ట్రంలో 119 నియోజక వర్గాల్లో సభలు నిర్వహించాలని నిర్ణయించింది. ఎస్సీ, ఎస్టీ రిజర్వుడు నియోజకవర్గాలకు తొలి ప్రాధాన్యత ఇవ్వనుంది. 19 ఎస్సీ నియోజక వర్గాలు, 12 ఎస్టీ నియోజకవర్గాలపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించింది. తక్కువ సమయంలో ప్రజలకు చేరువయ్యేలా కార్యాచరణ రచించింది. రెండు వారాల్లోనే 31 సభల ఏర్పాటుకు సన్నాహాలు చేస్తోంది. బీజేపీ సభలకు రాష్ట్ర నాయకత్వంలోని అగ్రనేతలు హాజరుకానున్నారు.