వరదలో కొట్టుకొచ్చిన పాల ప్యాకెట్లు.. ఏరుకునేందుకు ఎగబడిన జనం.. వీడియో ఇదిగో!
- మచిలీపట్నంలో గురువారం మధ్యాహ్నం ఘటన
- భారీ వర్షానికి జలమయం అయిన రోడ్లు
- వాహనంలో నుంచి వరద నీళ్లలో పడ్డ పాల ప్యాకెట్లు
వరద నీళ్లలో పాల ప్యాకెట్లు కొట్టుకురావడమేంటని ఆరాతీయగా.. సాయిబాబా ఆలయం జంక్షన్‌లో మోకాలిలోతు నీరు నిలిచింది. ఆ వరదలోనే అటుగా వెళ్తున్న ఓ వాహనం నుంచి పాల ప్యాకెట్ల ట్రేలు కిందపడ్డాయి. దీంతో పాల ప్యాకెట్లు కొట్టుకొచ్చాయని, నీళ్లలో దిగి స్థానికులు వాటిని ఏరుకున్నారని చెబుతున్నారు. కాగా, రెండు రోజులుగా ఏపీలోని తీర ప్రాంతాల్లో వర్షాలు దంచికొడుతున్నాయి. మరో రెండు రోజుల పాటు వర్షాలు కొనసాగుతాయని వాతావరణ శాఖ పేర్కొంది.