35 రోజుల క్రితం చనిపోయిన ఎస్సై ప్రభాకర్ రెడ్డికి ట్రాన్స్ ఫర్ ఆర్డర్స్!

SI who dead 35 days back got transfer orders
  • సైబరాబాద్ పరిధిలో 83 మంది ఎస్సైల బదిలీ
  • జాబితాలో ప్రభాకర్ రెడ్డి పేరు
  • తప్పును సరిదిద్ది మరోసారి జాబితాను విడుదల చేసిన ఉన్నతాధికారులు
ఒక్కోసారి ఎవరూ ఊహించని విధంగా పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అలాంటి మరో ఘటనే తెలంగాణ పోలీసు శాఖలో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే... బి.ప్రభాకర్ రెడ్డి అనే ఎస్సై 35 రోజుల క్రితం గుండెపోటుతో మృతి చెందారు. దుండిగల్ పోలీస్ స్టేషన్ లో ఆయన విధులు నిర్వహించేవారు. 

తాజాగా సైబరాబాద్ పరిధిలో ఎస్సైలను బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. మొత్తం 83 మంది ఎస్సైలను బదిలీ చేశారు. ఈ జాబితాలో ప్రభాకర్ రెడ్డి పేరు కూడా ఉంది. ఆయనను జీనోమ్ వ్యాలీ పీఎస్ కు బదిలీ చేస్తున్నట్టు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఈ విషయం వాట్సాప్ గ్రూపుల్లో బాగా షేర్ అయింది. విషయం తెలుసుకున్న ఉన్నతాధికారులు దిద్దుబాటు చర్యలు చేపట్టారు. పాత జాబితాను సరిదిద్ది, అందులో నుంచి ప్రభాకర్ రెడ్డి పేరును తొలగించారు. కొత్త జాబితాతో మరోసారి ఉత్తర్వులను జారీ చేశారు.
Go Back to Shorts
SI
Dead
Transfer

More Telugu News