బంగాళాఖాతంపై ఉపరితల ఆవర్తనం... తెలుగు రాష్ట్రాల్లో రెండ్రోజుల పాటు భారీ వర్షాలు
- రాగల ఐదు రోజులకు ఐఎండీ వాతావరణ నివేదిక
- సాధారణ రుతుపవన ద్రోణి కొనసాగుతోందని వెల్లడి
- రేపు, ఎల్లుండి తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా వర్షాలు
- ఉత్తరాదిన కుండపోత వానలు కురిసే అవకాశం
ఇక, ఉత్తరాదిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది. హిమాచల్ ప్రదేశ్ లో 5 రోజుల పాటు భారీ వర్షాలు, యూపీలో రెండ్రోజుల పాటు కుండపోత వానలు కురుస్తాయని వెల్లడించింది.
దక్షిణాదిన తమిళనాడులో రాగల రెండ్రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, కర్ణాటక, కేరళలో రాగల మూడ్రోజుల పాటు విస్తారంగా వర్షాలు పడతాయని ఐఎండీ పేర్కొంది.