వయసు పెరిగిపోతున్నా పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన సదా
Get Instant Access to ap7am Free web app · Opens in one tap Install

వయసు పెరిగిపోతున్నా పెళ్లి ఎందుకు చేసుకోలేదో చెప్పిన సదా

I am not interested in marriage says actress Sada
  • 39 ఏళ్లకు చేరుకున్న సదా వయసు
  • తనకు పెళ్లి అంటే ఇష్టం లేదని స్పష్టం చేసిన సదా
  • పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని వ్యాఖ్య
2002లో దర్శకుడు తేజ తెరకెక్కించిన 'జయం' చిత్రం ద్వారా సినీ పరిశ్రమలో అడుగుపెట్టిన హీరోయిన్ సదా ఆ తర్వాత స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకుంది. తెలుగుతో పాటు తమిళం, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పలు చిత్రాల్లో ఆమె నటించింది. ప్రస్తుతం సదాకు సినిమా అవకాశాలు తగ్గిపోయాయి. టీవీ రియాల్టీ షోలు, డ్యాన్స్ షోలకు ఆమె జడ్జిగా వ్యవహరిస్తోంది. మరోవైపు ఆమె వయసు కూడా 39 ఏళ్లకు చేరుకుంది. ఇప్పటి వరకు ఆమె పెళ్లి చేసుకోలేదు. దీంతో ఎక్కడకు వెళ్లినా పెళ్లికి సంబంధించిన ప్రశ్నలే ఆమెకు ఎదురవుతున్నాయి. 

తాజాగా ఓ ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ తన పెళ్లి గురించి క్లారిటీ ఇచ్చింది. తనకు పెళ్లి అంటే ఆసక్తి లేదని స్పష్టం చేసింది. పెళ్లి చేసుకునే వ్యక్తి అర్థం చేసుకునే వాడు కావచ్చు, కాకపోవచ్చు అని పేర్కొంది. పెళ్లి చేసుకుంటే స్వేచ్ఛను కోల్పోతామని చెప్పింది. ఈ రోజుల్లో పెళ్లిళ్లు ఎక్కువ కాలం నిలబడటం లేదని, చిన్నచిన్న కారణాలకే భార్యాభర్తలు విడిపోతున్నారని, అందుకే తనకు పెళ్లిపై ఆసక్తి లేదని చెప్పింది.
Advertisement
Sada
Tollywood
Marriage

More Telugu News