ప్లాట్‌ఫామ్‌పై గాల్లో పిల్లిమొగ్గలు వేసిన యువకుడిని లోపలేసిన పోలీసులు.. వీడియో ఇదిగో!
- బీహార్‌లోని మాన్పూర్ రైల్వే స్టేషన్‌లో ఘటన
- అరెస్ట్ చేసినట్టు చెబుతూ వీడియోను షేర్ చేసిన పోలీసులు
- అరెస్ట్ ఎలా చేస్తారంటూ నిలదీస్తున్న నెటిజన్లు
- మంచిపనే చేశారంటున్న మరికొందరు
అంతవరకు బాగానే ఉన్నా పోలీసులు వ్యవహరించిన తీరుపై నెటిజన్లు రెండుగా చీలిపోయారు. ఎక్కువమంది యువకుడి చేష్టలను వ్యతిరేకించగా, మరికొందరు మాత్రం అలా ఎలా అరెస్ట్ చేస్తారని పోలీసులపై మండిపడుతున్నారు. హెచ్చరించి వదిలేయాలి కానీ, అరెస్ట్ చేసేయడమేనా? అని ప్రశ్నిస్తున్నారు. కౌన్సెలింగ్ ఇచ్చి వదిలిపెట్టి ఉండాల్సిందని అంటుండగా, మరికొందరు మాత్రం మంచి పనే చేశారని, ఇలాంటి వాటిని చూస్తూ ఊరుకుంటే ఇలా చెలరేగిపోతూ ప్రయాణికులను భయభ్రాంతులకు గురిచేస్తుంటారని పేర్కొన్నారు.