నితిన్ సినిమా నుంచి తప్పుకున్న రష్మిక!
- పాన్ ఇండియా స్థాయిలో రష్మిక ఫాలోయింగ్
- 'పుష్ప' హిట్ తరువాత పెరిగిన మార్కెట్
- వరుసగా భారీ ప్రాజెక్టులకి సైన్
- డేట్స్ సర్దుబాటు చేయలేక నితిన్ ప్రాజెక్టు వదులుకున్న భామ
ఒక వైపున తెలుగులో 'పుష్ప 2' వంటి భారీ ప్రాజెక్టు చేస్తోంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న నార్త్ ఇండియన్ .. సౌత్ ఇండియన్ ప్రేక్షకులు ఈ సినిమా కోసం ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు. ఇక తెలుగు - తమిళ భాషల్లో రూపొందుతున్న 'రెయిన్ బో' సినిమాలోనూ ఆమెనే కథానాయిక. ఈ సినిమా కూడా భారీ బడ్జెట్ తో రూపొందుతున్నదే.
ఇవి కాకుండా రెండు హిందీ ప్రాజెక్టులు లైన్లో ఉన్నాయి. అందువలన ఇక నితిన్ - వెంకీ కుడుముల సినిమాకి డేట్స్ సర్దుబాటు చేయడం కష్టమని భావించిన ఆమె, ఆ సినిమా నుంచి తప్పుకుందని సమాచారం. గతంలో నితిన్ - రష్మిక కాంబినేషన్లో వచ్చిన 'భీష్మ' బ్లాక్ బస్టర్ హిట్ అయింది. అలాంటి మేజిక్ మరోసారి రిపీట్ అవుతుందేమోనని అనుకుంటే, రష్మిక ఇలా హ్యాండ్ ఇచ్చేసింది.