సీఎస్కే జట్టులోకి తీసుకోవాలని అడిగిన నటుడు.. ధోనీ ఏమన్నాడంటే..!

Actor Yogi Babu asks MS Dhoni to hire him for CSK
  • ధోని నిర్మిస్తున్న సినిమా ‘ఎల్ జీఎం’ ఆడియో రిలీజ్ ఫంక్షన్ లో యోగి బాబు అభ్యర్థన
  • బౌలర్లు టార్గెట్ చేసి గాయపరుస్తారన్న కెప్టెన్ కూల్
  • ఫంక్షన్ కు సతీసమేతంగా హాజరైన ధోని
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్, క్రికెట్ లెజెండ్ మహేంద్ర సింగ్ ధోని సినిమా రంగంలోకి అడుగుపెట్టిన విషయం తెలిసిందే. భార్య సాక్షితో కలిసి ‘ఎల్ జీఎం’ అనే తమిళ సినిమాకు ధోని నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. తాజాగా ఈ సినిమా ఆడియో, ట్రైలర్ రిలీజ్ వేడుక చెన్నైలోని లీలా ప్యాలెస్ లో జరిగింది. 

ఈ సందర్భంగా నిర్వహించిన ఫంక్షన్ లో ఎల్ జీఎం సినిమాలో కీలక పాత్ర పోషించిన నటుడు యోగి బాబు మాట్లాడుతూ.. చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్ కే) జట్టులోకి తనను తీసుకోవాలని ధోనిని అడిగారు. దీనికి ధోనీ ఇచ్చిన జవాబు ఫంక్షన్ లో నవ్వులు పూయించింది.

యోగి బాబుకు జవాబిస్తూ.. అంబటి రాయుడు రిటైర్మెంట్ ప్రకటించడంతో సీఎస్ కే జట్టులో ఖాళీ ఉందని, ఆ ప్లేస్ లో తప్పకుండా నిన్నే తీసుకుంటామని ధోని చమత్కరించాడు. ఈ విషయంపై సీఎస్ కే మేనేజ్ మెంట్ తో మాట్లాడతానని సరదాగా హామీ ఇచ్చారు. అయితే, యోగి బాబు సినిమాలతో బిజీగా ఉన్నాడని గుర్తు చేస్తూ క్రికెట్ బాగా ఆడతావు కాబట్టి బౌలర్లు అందరూ నిన్నే టార్గెట్ చేస్తారని ధోనీ హెచ్చరించారు. నిన్ను గాయపరచడమే లక్ష్యంగా వేగంగా బంతులు విసురుతారని ధోని చెప్పడంతో యోగి బాబు సహా అక్కడున్న వారంతా నవ్వు ఆపుకోలేకపోయారు.
Advertisement
Yogi Babu
MS Dhoni
LGM
tamil movie
procucer Dhoni
audio release
chennai

More Telugu News