ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో గుండెపోటుతో ఇద్దరి మృతి
- జిమ్ నుంచి ఇంటికొచ్చిన కాసేపటికే గుండెపోటు
- ఆసుపత్రికి తీసుకెళ్లిన కాసేపటికే మృతి
- నిన్న ఉదయం అల్లిపురంలో గుండెపోటుకు ఓ వ్యక్తి బలి
తాజాగా ఖమ్మంలో 24 గంటల వ్యవధిలో ఇద్దరు వ్యక్తులు గుండెపోటుతో మృతి చెందారు. 31 ఏళ్ల శ్రీధర్ ఈ ఉదయం జిమ్‌లో వ్యాయామం చేసి ఇంటికొచ్చిన కాసేపటికే గుండెపోటుతో కుప్పకూలిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే ఆయనను ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత కాసేపటికే మరణించాడు.
శ్రీధర్ తండ్రి మానుకొండ రాధాకిశోర్ గతంలో ఖమ్మం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్‌గా పనిచేశారు. కాగా, ఖమ్మంలోని అల్లిపురంలో నిన్న ఉదయం గరికపాటి నాగరాజు (33) కూడా గుండెపోటుతోనే ప్రాణాలు విడిచాడు.