పోలవరం కట్టేదీ మేమే.. అమరావతి నిర్మించేదీ మేమే.. తానా సభల్లో రేవంత్‌రెడ్డి
- ప్రజల కోసం ఏమైనా చేసే అవకాశం ఇవ్వాలన్న రేవంత్
- అవసరమైతే సీతక్కను సీఎం చేస్తామన్న టీపీసీసీ చీఫ్
- ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించే సంప్రదాయం కాంగ్రెస్‌కు లేదని స్పష్టీకరణ
దళితులు, ఆదివాసీలను ముఖ్యమంత్రిని కానివ్వరా? అన్న ప్రశ్నకు రేవంత్ స్పందిస్తూ.. ఎన్నికలకు ముందు సీఎం అభ్యర్థిని ప్రకటించడం కాంగ్రెస్‌లో లేదన్నారు. అవసరమైతే సీతక్కను పార్టీ ముఖ్యమంత్రిని కూడా చేస్తుందన్నారు. ప్రజల కోసం తాను ఏమైనా చేయాలని అనుకుంటున్నానని, వచ్చే ఎన్నికల్లో తనకు అవకాశం ఇవ్వాలని కోరారు. వచ్చే ఎన్నికల్లో పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేందుకు అవసరమైన సహాయ సహకారాలు అందించాలన్నారు. పార్టీని, తనను వేరు చేసి చూడొద్దని, తెలంగాణలో కాంగ్రెస్సే రేవంత్‌రెడ్డి, రేవంత్‌రెడ్డే కాంగ్రెస్ అని వ్యాఖ్యానించారు.