పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా సేవ చేస్తా: పాలేరులో షర్మిల

YS Sharmila meeting in Paler
  • ఇడుపులపాయ నుండి పాలేరుకు వైఎస్ షర్మిల
  • ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్యశ్రీ సేవలతో వైఎస్ పాలన తీసుకువస్తానని వ్యాఖ్య
  • త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభిస్తానని వెల్లడి
పాలేరు ప్రజల సాక్షిగా... పాలేరు మట్టి సాక్షిగా... ఈ రాజశేఖరరెడ్డి బిడ్డ పాలేరుకు రాజశేఖరరెడ్డి గారి పాలనను  అందిస్తానని మాట ఇచ్చిందని వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు షర్మిల అన్నారు. శనివారం ఉదయం ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ వద్ద వైఎస్సార్ జయంతి సందర్భంగా నివాళులు అర్పించారు. ఆ తర్వాత ప్రత్యేక విమానంలో హైదరాబాద్ చేరుకొని, అక్కడి నుండి పాలేరుకు వెళ్లారు. పాలేరులో వైఎస్ 74వ జయంతి వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా షర్మిల మాట్లాడుతూ... త్వరలో పాలేరులో పాదయాత్రను ప్రారంభించి, ఇక్కడే ముగిస్తానని చెప్పారు.

రైతులకు అండగా నిలబడతానని, ఇల్లు లేని పేదలకు ఇల్లు కట్టిస్తానని, పేద బిడ్డల ఫీజు రీయింబర్స్‌మెంట్, ఆరోగ్య శ్రీలతో దివంగత ముఖ్యమంత్రి పాలనను తీసుకు వస్తానని చెప్పారు. నేను మళ్లీ చెబుతున్నా.. రాజశేఖరరెడ్డి బిడ్డను.. పులి కడుపున పులే పుడుతుంది.. మీ బిడ్డగా మీకు నమ్మకంగా సేవ చేస్తానన్నారు. రాజశేఖరరెడ్డి సంక్షేమ పాలన ప్రతి గడపకు చేరుస్తానని మాట ఇస్తున్నానన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 3,800 కిలో మీటర్లు పాదయాత్ర చేశానని, త్వరలో మళ్లీ ఆ పాదయాత్రను పాలేరులో కొనసాగించి 4000 కిలో మీటర్లు పూర్తి చేసి ఇక్కడే ముగిస్తానన్నారు.
Go Back to Shorts
YS Sharmila
paler
Khammam District

More Telugu News