తప్పుడు ప్రచారం చేస్తున్నారంటూ ఈటల రాజేందర్ ఆగ్రహం
- బీఆర్ఎస్, బీజేపీ ఒక్కటేనని దుష్ప్రచారం చేస్తున్నారన్న ఈటల
- 2019 నుండి గెలిస్తే బీజేపీ లేదా అధికార బలంతో బీఆర్ఎస్ గెలిచాయని వెల్లడి
- కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదని వ్యాఖ్య
బీఆర్ఎస్ పార్టీతో మూడున్నరేళ్లుగా బరిగీసి, కొట్లాడిన పార్టీ బీజేపీ మాత్రమే అన్నారు. తెలంగాణ గడ్డపై తమ విజయపరంపర 2019లో ప్రారంభమైందని, ఆ తర్వాత దుబ్బాక, హుజూరాబాద్, జీహెచ్ఎంసీ, మునుగోడులో నైతిక విజయం, కరీంనగర్, వరంగల్ కార్పోరేషన్లలో గెలుపు, ఇటీవల ఉపాధ్యాయ ఎన్నికల్లో గెలుపు... వరుసగా గెలుస్తున్నామన్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో గెలిచింది బీజేపీ లేదా అధికార, డబ్బు బలంతో బీఆర్ఎస్ మాత్రమేనని, కాంగ్రెస్ ఎక్కడా గెలవలేదన్నారు. కానీ మాపై తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు. ఇంతగా చెబుతుంటే కొన్ని యూట్యూబ్ ఛానల్స్, పత్రికలు, టీవీ ఛానల్స్ తప్పుడు ప్రచారం చేస్తున్నాయన్నారు.
తెలంగాణలో గెలుపే లక్ష్యంగా అధిష్ఠానం ముందుకు సాగుతోందన్నారు. కేసీఆర్ కుటుంబ పాలనను ఎట్టి పరిస్థితుల్లోను వదిలేది లేదని, ఆయన దోపిడీని ఊరుకునేది లేదని ప్రధాని మోదీ స్పష్టంగా చెప్పారన్నారు. తెలంగాణలో బీజేపీకి ఓటు వేస్తే మాత్రమే ప్రజలకు మేలు జరుగుతుందన్నారు. ప్రాంతీయ పార్టీలకు ఓటు వేస్తే అక్రమార్జన, ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమే అన్నారు.