మోదీ పర్యటనకు కేసీఆర్ కు ఆహ్వానం.. ఈసారైనా కేసీఆర్ వెళ్తారా?
- ఈ నెల 8న తెలంగాణకు వస్తున్న ప్రధాని
- వరంగల్ లో పలు ప్రాజెక్టులకు శంకుస్థాపన
- ఇటీవలి కాలంలో కేంద్రంపై విమర్శలు తగ్గించిన కేసీఆర్
ఈ రెండేళ్ల కాలంలో తెలంగాణకు మోదీ పలుమార్లు వచ్చారు. ప్రొటోకాల్ ప్రకారం కేసీఆర్ ను ఆహ్వానించినప్పటికీ ఆయన ఒక్కసారి కూడా హాజరుకాలేదు. అన్ని సందర్భాల్లో మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ప్రధానికి ఆహ్వానం పలికి, వీడ్కోలు పలికేవారు. అయితే గత కొంత కాలంగా బీజేపీపై కేసీఆర్ విమర్శలు తగ్గించారు. దీంతో, మోదీ పర్యటనకు కేసీఆర్ హాజరవుతారా? అనే అంశంపై రాష్ట్రంలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది.