ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేక క్లినిక్

Transgender clinic opened in Osmania hospital
  • క్లినిక్ లో నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చిన సేవలు
  • బుధవారం ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు పని చేయనున్న క్లినిక్
  • తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేసిన ట్రాన్స్ జెండర్స్
ట్రాన్స్ జెండర్స్ కు పత్యేక వైద్య సేవలు అందించే దిశగా తెలంగాణ ప్రభుత్వం కీలక అడుగు వేసింది. హైదరాబాద్ లోని ఉస్మానియా ఆసుపత్రిలో ట్రాన్స్ జెండర్స్ కోసం ప్రత్యేకంగా ఒక క్లినిక్ ను ప్రారంభించింది. ఈ క్లినిక్ నిన్నటి నుంచి అందుబాటులోకి వచ్చింది. సెన్సిటైజేషన్ శిక్షణ పొందిన వైద్యులు వీరికి అనేక రకాల చికిత్సలను ఈ క్లినిక్ లో అందించనున్నారు. ప్రస్తుతానికి కేవలం బుధవారం మాత్రమే ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు క్లినిక్ ఉంటుంది. రద్దీని బట్టి రాబోయే రోజుల్లో రోజుల సంఖ్యను పెంచనున్నారు. మరోవైపు తమకు ప్రత్యేక క్లినిక్ ను ఏర్పాటు చేయడంపై ట్రాన్స్ జెండర్లు సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వానికి వారు ధన్యవాదాలు తెలియజేశారు.
Go Back to Shorts
Transgender Clinic
Hyderabad
Osmania Hospital

More Telugu News