Komatireddy Raj Gopal Reddy: బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి నియామకం

key post for Komatireddy Rajagopal Reddy in BJP
షార్ట్స్‌లో చూడండి
గత ఏడాది కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చి, మునుగోడు ఎన్నికల్లో పార్టీ తరఫున పోటీ చేసిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడిగా నియమించింది. ఈ మేరకు పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు మరో ఐదారు నెలల గడవు మాత్రమే ఉంది. ఈ సమయంలో పార్టీ అధిష్ఠానం కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. జాతీయ కార్యవర్గ సభ్యుడిగా రాజగోపాల్ రెడ్డి నియామకం తక్షణమే అమల్లోకి వస్తుందని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి అరుణ్ సింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. నిన్న బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడిగా కిషన్ రెడ్డిని, అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కమిటీ చైర్మన్ గా ఈటల రాజేందర్ ను అధిష్ఠానం నియమించింది.
Go Back to Shorts
Komatireddy Raj Gopal Reddy
BJP

More Telugu News