అతిప్రేమతో పిల్లలకు వాహనాలు ఇస్తే ఇలాంటి ప్రమాదాలే జరుగుతాయి: సజ్జనార్
- నగర శివారులో కారు ఢీకొని తల్లీకూతుళ్ల మరణంపై సజ్జనార్ ట్వీట్
- యువకుడి నిర్లక్ష్యం, మితిమీరిన వేగం తల్లీకూతుళ్లను బలిగొందని విచారం
- పిల్లలపై అతిప్రేమతో వాహనాలు ఇస్తే ఇలాంటి దుర్ఘటన జరుగుతుందని వ్యాఖ్య
హైదర్షాకోట్లోని లక్ష్మీ నరసింహ కాలనీలో నివసించే నెమలి అనురాధ(48), ఆమె కుమార్తె(26) మంగళవారం ఉదయం 6 గంటలకు వాకింగ్ కోసం ఇంటినుంచి బయటకు వచ్చారు. సమీప కాలనీకి చెందిన కవిత(36)తో కలిసి వారు బండ్లగూడ జాగీర్ సన్సిటీ వాగింగ్ చేస్తుండగా మలుపు వద్ద ఓ అదుపు తప్పిన కారు వేగంగా వచ్చి వారిని వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో, ముగ్గురూ 10 మీటర్ల దూరం ఎగిరిపడ్డారు. వారికీ సమీపంలోనే నడుస్తూ వెళుతున్న ఇంతియాజ్ ఆలం ఖాన్ను కూడా కారు ఢీకొట్టింది. ఈ ఘటనతో తల్లీకూతుళ్లు అక్కడికక్కడే మృతిచెందారు. కవిత, ఆలంఖాన్ తీవ్రంగా గాయపడ్డారు. వారు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.