Ramcharan: విజయ్ ‘లియో’లో రామ్ చరణ్ ప్రత్యేక అతిథి పాత్ర!

  • లోకేశ్ కనకరాజ్ దర్శకత్వంలో నటిస్తున్న దళపతి విజయ్
  • క్లైమాక్స్ లో చరణ్ అతిథి పాత్ర చేస్తున్నట్టు ప్రచారం
  • హీరోయిన్‌ గా నటిస్తున్న త్రిష
Ram Charan To Cameo In Thalapathy Vijay and Lokesh Kanagaraj Leo

తమిళ సూపర్ స్టార్, ఇళయ దళపతి విజయ్ తో సంచలన దర్శకుడు లోకేశ్ కనకరాజ్ ‘లియో’సినిమా తెరకెక్కిస్తున్నాడు. ఈ చిత్రంలో త్రిష హీరోయిన్ గా నటిస్తోంది. ఖైదీ, విక్రమ్ లాంటి బ్లాక్ బస్టర్స్ ఖాతాలో వేసుకున్న కనకరాజ్, విజయ్ కాంబినేషన్ లో వస్తున్న ఈ చిత్రంపై సహజంగానే భారీ అంచనాలున్నాయి. దీనికి తోడు విజయ్ త్వరలోనే రాజకీయాల్లోకి వెళ్తాడన్న ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఈ సినిమాపై మరింత హైప్ క్రియేట్ అయింది. దీన్ని రెట్టింపు చేసేలా దర్శకుడు లోకేశ్ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తో అతిథి పాత్ర చేయిస్తున్నట్టు తెలుస్తోంది. 

ఈ మధ్య లోకేశ్, చరణ్ డిన్నర్ చేస్తున్న ఫొటో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రం క్లైమాక్స్ ఓ కీలక పాత్ర కోసం చెర్రీని ఒప్పించేందుకు డిన్నర్‌‌కు ఆహ్వానించినట్టు తెలుస్తోంది. సినిమా క్లైమాక్స్‌ లో హీరో గురించి చెప్పే అతిథి పాత్రకు చరణ్ ఓకే చెప్పినట్టు వార్తలు వస్తున్నాయి. కాగా, ఈ చిత్రం అక్టోబర్ 19న విడుదల కానుంది.

More Telugu News