Avinash Reddy: ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టు, ఆ వెంటనే విడుదలపై బులెటిన్ విడుదల చేసిన లోక్ సభ సచివాలయం

  • వివేకా హత్య కేసులో సీబీఐ దర్యాప్తు
  • జూన్ 3న ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్ట్... వెంటనే విడుదల
  • ఇదే విషయాన్ని లోక్ సభ సచివాలయానికి తెలిపిన సీబీఐ
  • సీబీఐ లేఖ నిన్ననే అందిందన్న లోక్ సభ సచివాలయం
Lok Sabha secretariat releases bulletin on MP Avinash Reddy arrest

వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు జరుపుతున్న సీబీఐ వైసీపీ ఎంపీ అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి, వెంటనే విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, ఎంపీ అవినాశ్ రెడ్డి అరెస్టుపై లోక్ సభ సచివాలయం బులెటిన్ విడుదల చేసింది. 

అవినాశ్ అరెస్టుపై లోక్ సభ సచివాలయానికి సీబీఐ సమాచారమిచ్చింది. జూన్ 3న అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేసి వెంటనే విడుదల చేశామని సీబీఐ వివరణ ఇచ్చింది. అవినాశ్ రెడ్డిని రూ.5 లక్షల పూచీకత్తు, రెండు ష్యూరిటీలతో విడుదల చేశామని వెల్లడించింది. అరెస్ట్ చేస్తే వెంటనే బెయిల్ ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు ఆదేశాలు ఇచ్చిందని, ఆ మేరకు అతడిని విడుదల చేశామని సీబీఐ పేర్కొంది. 

కాగా, సీబీఐ లేఖ తమకు నిన్న అందిందని లోక్ సభ సచివాలయం వెల్లడించింది.

More Telugu News