ఎస్బీఐ ఖాతాదారులకు శుభవార్త.. కార్డు లేకుండా అన్ని ఏటీఎంలలో విత్ డ్రాకు అవకాశం
- ఖాతాదారులకు ఎస్బీఐ నూతన సేవలు
- ఇప్పటిదాకా ఎస్బీఐ ఏటీఎంలలోనే ఈ అవకాశం
- యోనో యాప్ ను అప్ గ్రేడ్ చేసిన ఎస్బీఐ
ఇతర బ్యాంకుల ఖాతాదారులు కూడా యూపీఐ లావాదేవీల కోసం యోనో యాప్‌ను వాడుకునేలా ఎస్బీఐ మార్పులు చేసింది. ఇందుకోసం ‘యోనో ఫర్ ఎవ్రీ ఇండియన్’ థీమ్‌ను తీసుకొచ్చింది. స్కాన్, పే, పే బై కాంటాక్ట్స్, రిక్వెస్ట్ మనీ వంటి సదుపాయాలు దీనిలో ఉంటాయని ఎస్బీఐ వివరించింది.