ఢిల్లీకి బీజేపీ రాష్ట్ర నేతలు బండి, రఘునందన్
- అధిష్ఠానం పిలుపుతో ఇప్పటికే ఢిల్లీ చేరుకున్న రఘునందన్ రావు
- కొద్దిసేపటి క్రితమే బయల్దేరిన పార్టీ రాష్ట్ర చీఫ్ బండి సంజయ్
- సాయంత్రం కేంద్ర కేబినెట్ భేటీ నేపథ్యంలో రాష్ట్ర నేతల టూర్
తాజాగా ప్రధాని మోదీ అధ్యక్షతన సోమవారం సాయంత్రం కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్స్ సమావేశం జరగనుంది. ఈ సమయంలోనే బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరోసారి ఢిల్లీకి వెళ్లడంపై పార్టీలో ఉత్కంఠ నెలకొంది. బండి కంటే ముందే రఘునందన్ రావు కూడా ఢిల్లీకి వెళ్లారు. ఇద్దరు నేతలు ఒకరి తర్వాత ఒకరు హస్తినకు వెళ్లడంతో రాష్ట్ర నాయకత్వంలో మార్పులు చోటుచేసుకుంటాయని ప్రచారం జరుగుతోంది. ఈ ఇద్దరు నేతల మధ్య విభేదాలు పొడసూపాయని, కొన్ని రోజులుగా వారు కలుసుకోలేదని ఊహాగానాలు వినిపిస్తున్నాయి.